రెండేళ్ల చిన్నారిని చావుబతుకుల్లోకి నెట్టిన ప్రీ స్కూల్

Update: 2018-08-21 11:53 GMT

హైదరాబాద్ మధురానగర్ లోని ఓ ప్రీ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ రెండు సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులు ప్రైవేటు డై కేర్ సెంటర్ లో చేర్పించారు. అయితే, సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా సదరు బాలుడు టర్పెంట్ ఆయిల్ తాగాడు. తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో బాలుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఈ ఘటనపై ఫిర్యాదు చేయవద్దని సెంటర్ నిర్వాహకులు బాలుడి తల్లిదండ్రులను కాళ్లావేళ్లా పడి బతిమిలాడారు. బాలుడి ఆసుపత్రి ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకుండా వదిలేశారు. ఇప్పడు ఆసుపత్రి ఖర్చు రూ.47 లక్షలు కావడంతో డే కేర్ సెంటర్ వారు మాట తప్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వమని, ఏమి చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నారు. దీంతో దయనీయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించారు.

Similar News