ఐపీఎస్ కు రాజీనామా

ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెయిల్ చేసినట్టుగా ఆర్ఎస్ [more]

Update: 2021-07-19 13:32 GMT

ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెయిల్ చేసినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా ప్రకటించాడు. 26 సంవత్సరాల పాటు ఐపీఎస్ గా కొనసాగానని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు రెండు పేజీల లేఖను విడుదల చేశారు. దీంతో పాటు తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ సంబంధించిన ప్రకటన చేశాడు. తన మనసుకు ఇష్టమైన నచ్చిన పనులను చేయబోతున్నట్లు గా ప్రకటించాడు. తన శేష జీవితం మొత్తం కూడా సమాజ సేవకే అంకితం చేయాలని ప్రకటించాడు. 2013 లో గురుకుల సెక్రటరీ గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థను మార్చివేశాడు. ఇటీవల కాలంలో సంచలన కామెంట్లకు కేంద్ర బిందువైన, అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించడం ఐపీఎస్ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News