బెజవాడ హత్య కేసులో…?

బెజవాడ హత్యకేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. తాడిగడపకు చెందిన కరణం రాహుల్ హత్య కు కారణం వ్యాపార విభేదాలేనని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. రాహుల్ కంపెనీలో డైరెక్టర్ గా [more]

Update: 2021-08-20 04:22 GMT

బెజవాడ హత్యకేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. తాడిగడపకు చెందిన కరణం రాహుల్ హత్య కు కారణం వ్యాపార విభేదాలేనని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. రాహుల్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కోరాడ విజయకుమార్ పై అనుమానాలు తలెత్తాయి. ఆయన హత్య జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పారిశ్రామికవేత్త రాహుల్ ను నలుగురు హత్య చేసి ఉండవచ్చని పోలీసుల నిర్ధారణకు వచ్చారు. హంతకుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా రాహుల్ కు, కోరాడ విజయకుమార్ కు మధ్య వ్యాపార సంబంధమైన విభేదాలు తలెత్తాయని పోలీసులు గుర్తించారు. విజయకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News