బండి సంజయ్ పై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లనే కేసు నమోదు [more]

Update: 2020-05-13 04:53 GMT

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉండగా బండి సంజయ్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించడం వివాదాస్పదమయింది. బత్తాయి రైతులను పరామర్శించేందుకు బండి సంజయ్ వెళ్లారు. సోషల్ డిస్టెన్స్ ను పాటించకుండానే బండి సంజయ్ పర్యటన సాగినట్లు గుర్తించిన పోలీసులు ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News