తేల్చుకుందామంటే రెడీ

బాహాబాహీగా తేల్చుకుందామంటే రెడీ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనకు ప్రాణం మీద ఆశలేదన్నారు. వైసీపీ నేతలు తమను అసభ్య కరంగా మాట్లాడుతున్నారని, జనసేన సహనాన్ని [more]

Update: 2019-12-12 13:06 GMT

బాహాబాహీగా తేల్చుకుందామంటే రెడీ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనకు ప్రాణం మీద ఆశలేదన్నారు. వైసీపీ నేతలు తమను అసభ్య కరంగా మాట్లాడుతున్నారని, జనసేన సహనాన్ని పరీక్షిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో ఒకరోజు రైతు సౌభాగ్య దీక్ష చేసి విరమించిన అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అసెంబ్లీని హుందాగా నడపాలన్నారు. అసెంబ్లీలో బోటు ప్రమాద బాధితులకు సంతాపం తెలపలేదని పవన్ అన్నారు. తమకు సూట్ కేసు కంపెనీలు లేవని, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని అన్నారు పవన్. రైతుల కష్టాలు తీరే వరకూ జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు. కూల్చివేతల ప్రభుత్వంగా మారిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. సహనంగా ఉండటమే జనసేన బలమని పవన్ కల్యాణ్ చెప్పారు. మీరెంత? మీ 150 మంది ఎమ్మెల్యేలెంత? అని పవన్ కల్యాణ్ ఫైరయ్యారు.

ఇంగ్లీష్ బాగా రాకే ఫెయిలయ్యా….

తనకు ఇంగ్లీష్ బాగా రాకనే ఇంటర్ ఫెయిలయ్యానని, ఇంగ్లీష్ పెట్టుకుంటే పెట్టుకోండని, తెలుగు భాషను రక్షించుకునే కార్యక్రమాన్ని జనసేన చేపడుతుందన్నారు. మన నుడి కార్యక్రమాన్ని జనసేన మొదలుపెడుతుందన్నారు. రైతుల కోసం తాను ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా తనకు రైతు సమస్యలు తెలుసునన్నారు పవన్ కల్యాణ్. అన్నం పెట్టే రైతులో కూడా సామాజికవర్గం చూస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటికి 9 కోట్లు ఖర్చు చేశారన్నారు. రైతుకు గిట్టుబాటు ధర మాత్రం ఇవ్వడం లేదన్నారు. వరి బస్తాకు 1500 గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. కౌలు రైతుల్లో కూడా కులాలు చూస్తే ఇంక ఈ రాష్ట్రం ఏం బాగుపడుతుందన్నారు. రైతులు కన్నీళ్లు ఆగేవరకూ తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.

Tags:    

Similar News