పవన్ కు అండగా టీడీపీ

Update: 2018-07-25 02:20 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కు టీడీపీ అండగా నిలిచింది. నిన్న వైసీపీ అధినేత జగన్ జనసేనాని పవన్ కల్యాణ‌్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే వ్యక్తిగతంగా కూడా జగన్ పవన్ పై విమర్శలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. పవన్ పై జగన్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తుందని పేర్కొంది. అంతేకాదు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, పవన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని తప్పపట్టింది. పవన్ పై జగన్ నీచమైన భాష వాడారని, సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నిన్నటి వరకూ పవన్ ను తిట్టిపోసిన తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో మాత్రం ఆయనకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది.

Similar News