ఉడుత ఎంత పనిచేసింది?

హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి ఐదుగురు సజీవ దహనం కావడానికి ఉడుత కారణమని విద్యుత్తు శాఖ అధికారులు వెల్లడించా

Update: 2022-06-30 06:42 GMT

హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి ఐదుగురు సజీవ దహనం కావడానికి ఉడుత కారణమని విద్యుత్తు శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆటోపై హైటెన్షన్ విద్కుత్ తీగ తెగపడి ఆటో లో ఉన్న ఐదుగురు మహిళలు సజీవ దహనమయిన సంగతి తెలిసిందే. ఈ ఆటోలో 12 మంది ప్రయాణిస్తుండగా ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. దీనిపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావు స్పందించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్తు తీగ తెగిపోయిందని ఆయన చెప్పారు.

ప్రమాదంపై విచారణ...
అయితే ఉడుత కారణంగా హైటెన్షన్ విద్యుత్తు తీగలు తెగిపడతాయా? అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ లో కూడా అధికారులు అతుకులు వేసి మమ అనిపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్తు నిపుణులు మాత్రం ఉడత కారణంగా విద్యుత్తు లైన్లు తెగిపడిన సంఘటనలు గతంలోనూ జరిగాయని చెబుతున్నారు. దీనిపై ఏపీఎస్సీడీసీఎల్ విచారణకు ఆదేశించింది. అనంతపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ను విచారణకు ఆదేశించారు. స్థానికులు మాత్రం కొత్త లైను వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News