ఇంజనీరింగ్ చదివి.. న్యాయవాదిగా మారి
నోముల భగత్ కుమార్ నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆయన 1984లో జన్మించారు. ఇంజనీరింగ్ చదవిన నోముల భగత్ ఎంబీఏ, ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కూడా చేశారు. [more]
నోముల భగత్ కుమార్ నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆయన 1984లో జన్మించారు. ఇంజనీరింగ్ చదవిన నోముల భగత్ ఎంబీఏ, ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కూడా చేశారు. [more]
నోముల భగత్ కుమార్ నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆయన 1984లో జన్మించారు. ఇంజనీరింగ్ చదవిన నోముల భగత్ ఎంబీఏ, ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కూడా చేశారు. సత్యం టెక్నాలజీస్ లో జూనియర్ ఇంజినీర్ గా పనిచేశారు. తర్వాత విస్టా ఫార్మా స్యూటికల్స్ లో మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తన తండ్రి నోముల నరసింహయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వెంటే ఉండి రాజకీయాలను పరిశీలించేవారు. 2004 నుంచి టీఆర్ఎస్ లో నోముల భగత్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పోట ీచేస్తున్నారు.