800 కోట్లకు బేరంపెట్టినా...దొరికిపోయారు

Update: 2018-09-11 11:53 GMT

హైదరాబాద్ పాత బస్తి నిజాం మ్యూజియం చోరీ కేసును పోలీసులు చేధించారు. హాలివుడ్ సినిమా తరహాలో ఈ చోరీ జరిగింది.. వెల్డింగ్ పని చేసుకునే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. చోరీకి గురైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. . నిందితులు ఇద్దరు వెల్డింగ్ వర్కర్స్. 45 రోజుల పాటు రెక్కి చేసి ఈ చోరీ చేసారని పోలీస్ కమీషనర్ చెప్పారు. మ్యూజియంలో 2800 ఐటమ్స్ ఉన్నాయి..10 రోజుల వ్యవధిలో నిజాం మ్యూజియం దోపిడీ కేసులోహైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులులను అరెస్ట్ చేశారు. చోరీకి గురైన నిజాం విలువైన సంపదను స్వాదినం చేసుకున్నారు.నిందితులు గౌస్ పాషా ,ముబీన్ లు గా గుర్తించారు. ఇద్దరు కూడా చింతల్ మెట్ ప్రాంతానికి చెందిన వారు ..నిందితులు వెల్డింగ్ వర్కర్స్ గా పని చేస్తున్నారు..రూఫ్ టాప్ నుంచి క్రిమినల్స్ క్రిందకు వచ్చారు.. మ్యూజియంలో ఓల్డ్ cc కెమెరాలు ఉన్నాయి.

సీసీ కెమెరా యాంగిల్స్ మార్చి......

3 ఫీట్ కెమెరా ఉంది. కాలితో పుష్ చేసి కెమెరా యాంగిల్ ను మర్చి వేశారు. ..సీన్ ఆఫ్ క్రైమ్ లో సీసీ ఫుటేజ్ నిల్ అని ఉంది. 4.4ఫీట్ రూఫ్ టాప్ పొడవు ఉంది. క్రిమినల్స్ సన్నగా ఉండటం తో ఈజీ గా లోపలికి దూరాడు. ఫేస్ లకు పుర్తి గా మాస్క్ లు వేశారు. ఈ కేసులో క్లూ లు లేకపోవడం తో 20 టీమ్స్ పెట్టారు.అయితే ఇద్దరు నిందితులు బాగా తెలివి గల వాళ్లు. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారు.ఎందుకంటే మ్యూజియం దగ్గర చోరీ చేస్తున్న సమయంలో వీరు సెల్ ఫొన్ లో మాట్లాడారు. అయితే తాము సెల్ టవర్ లొకెషన్ అన్నింటికి కూడా తీశాం.. ఎక్కడ కూడా అనూమానితులు మాకు దొరకలేదు. అయితే పోలీసులను తప్పు దొవ పట్టించేందుకు ఇద్దరు కూడా సెల్ ఫోన్ లో మాట్లాడినట్లుగా నటించారని కమిషనర్ తెలిపారు. తమ ఫింగర్ ప్రింట్ ఎక్కడ దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి చేతులకు గ్లౌజ్ వేసుకుని మొఖానికి మాస్క్ లు పెట్టుకున్నారు. చోరీ చేసిన తరువాత రెండు గంటల పాటుగా సిటిలోనే వున్నారు.

టూరిస్ట్ ల మాదిరిగా.....

ప్రతినిత్యం కూడా ఇద్దరు నిందితులు టూరిస్టుల మాదిరిగా మ్యూజియంకు వచ్చేవారు. చొరీ ఎలా చేయాలి ? ఎలా పారిపొవాలి? అన్న స్కేచ్ కూడా వేశారు. 45 రోజుల పాటుగా ప్రతినిత్యం కూడా మ్యూజియంకు వచ్చారు. ఇలా వచ్చిన ప్రతిసారి కూడా కొత్త కొత్త ప్లాన్ల్ వేశారు.ముఖ్యంగా లొపలికి ఎలా రావాలి? ఎలా వెళ్లిపొవాలి? లొపలికి రావడానికి మూడు మార్గాలు వున్నాయి.. అలాగే ఎక్కడ నుంచి అయితే ఈజీగా లోపల వున్న బంగారు వస్తువులను ఎత్తుకుని పొవచ్చు. ఇలాంటి వాటి పైన రెక్కీ చేశారు..ఇక్కడ సీసీ కెమోరాలు కూడా చాల పురాతనమైనవి..కాబట్టి ఎక్కువ కాలం కూడా డాటా వుండదని కూడా వీరు అంచనా వేసుకున్నారు. ఇద్దరు కూడా పాత దొంగలే. గతంలో కూడా చొరీ లు చేసి జైలుకు వెళ్లి వచ్చిన వారే అని పోలీసులు తెలిపారు..చొరీ చేసిన తరువాత కూడా ఎలా సిటి నుంచి బయటికి వెళ్లాలో కూడా ప్లాన్ ను సిద్దం చేసుకున్నారు.

దుబాయ్ వెళ్లి బేరం పెట్టి......

చోరీ చేసిన తరువాత రెండు గంటల పాటుగా సీటిలోనే తిరిగారు. ముత్తంగి హైవే నుంచి జహిరాబాద్ రోడ్డులోకి ఎంటర్ అయ్యారు. రెండు వందల కిలో మీటర్లు వరకు కూడా పల్సర్ మీదనే వెళ్లారు. అక్కడ బైక్ ను వదిలి పెట్టి ముంబైకి పయనం అయ్యారు. అక్కడ తాము దోచిన దానితో పాటుగా ముబీన్ ను అక్కడే పెట్టాడు గౌస్.. ముంబాయ్ లో ముబీన్ వదలిపెట్టి గౌస్ గల్ప్ కు వెళ్లాడు.అక్కడ తనకు వున్న పరిచయాలతో తాము దొచుకున్న వాటిని 800 కోట్లకు బేరం పెట్టారు. అయితే ఎవరు కూడా వీటిని కొనుగొలు చేయడానికి సిద్ద పడలేదు. దీంతో గౌస్ తిరిగి ముంబైకి వచ్చారు.అక్కడి నుంచి స్దానికంగా వీటిని అమ్మేందుకు ప్రయత్నం చేశారు. అది కూడా కుదరలేదు.దీంతో తాము దొచుకున్న వస్తువులతో ఇద్దరు కలిసి మళ్లి హైదరబాద్ కు వచ్చారు. మ్యూజియంలో చొరీ చేసిన వజ్రావైడ్యురాలతో పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, అదే తరహాలో వున్న కప్ సాసర్, స్పూన్ లను వందల కోట్లకు అమ్మాలని ప్లాన్ చేసిన ఇద్దరి నిందితులను పోలీసులు పట్టుకొగలిగారు. ఈ కేసులో మొత్తం ఆరు వందల పై చిలుకు సీసీ టివి కెమోరాలను పోలీసులు పరిశీలించారు. ఏది ఏమైనా మ్యూజియంకు సరియైన సెక్యూరిటి లేక పొవడం మూలంగానే ఈ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు.

Similar News