వివాదం లేకుండా ఎన్నికలు నిర్వహించండి.. నిమ్మగడ్డ ఆదేశాలు

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ [more]

Update: 2021-03-12 00:37 GMT

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ను ప్రిసైడింగ్ అధికారులగా నియమించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికైన సభ్యులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఈ ఎన్నికను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కార్పొరేషన్లు ఎక్కువగా ఉండటంతో అక్కడ జాయింట్ కలెక్టర్లను ప్రిసైడింగ్ అధికారులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారు.

Tags:    

Similar News