నిమ్మగడ్డ కేసు రేపటికి వాయిదా

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు రేపటికి వాయిదా పడింది. ఈరోజు హైకోర్టు ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలను [more]

Update: 2020-05-04 12:21 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు రేపటికి వాయిదా పడింది. ఈరోజు హైకోర్టు ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రభుత్వం కూడా ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెచ్చామని, ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ కు కూడా గవర్నర్ ఆమోదం ఉందని తెలిపింది. రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుపై రేపు తీర్పు వెలువడే అవకాశముంది.

Tags:    

Similar News