హైదరాబాద్ పాతబస్తీలో ఉగ్రవేట

Update: 2018-08-06 12:42 GMT

హైదరాబాద్ పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఉగ్రవేట జరుపుతోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం అర్థరాత్రి పాతబస్తీలోని ఫాహిన్ నగర్, పహాడీ షరీఫ్ ప్రాంతాల్లో గుజరాత్, కర్ణాటకకు చెందిన రెండు ఎన్ఐఏ బృందాలు సోదాలు జరిపి ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాదీనం చేసుకున్నారు.

వాట్సాప్ గ్రుపులో వ్యూహ రచన...

ఓ ఉగ్రవాద సంస్థ సభ్యులు భారత్ లో దాడి చేయడానికి వాట్సాప్ గ్రూప్ లో జరిపిన సంభాషణను గుర్తించిన ఇంటెలిజెన్స్ వెంటనే ఎన్ఐఏను అప్రమత్తం చేసింది. దీంతో అత్యంత గోప్యంగా ఎన్ఐఏ బృందాలు ఈ వేట కొనసాగిస్తున్నాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా, ఉగ్రవాదులు దొరికినా పాతబస్తీ లింకులు బయటపడుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు పాతబస్తీపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Similar News