షరీఫ్ కు ఊహించని షాక్

Update: 2018-04-13 08:38 GMT

పాకిస్థాన్ మాజీ ప్రధానినవాజ్ షరీఫ్ కు పాక్ సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఏ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పోటీచేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ఎటువంటి బహిరంగ సభలూ పెట్టకూడదని చెప్పింది. పనామా పేపర్ల కేసులో నవాజ్ షరీఫ్ దోషిగా తేలడంతో ఆయనపై జీవిత కాలం నిషేధం విధిస్తూ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గత ఏడాది పనామా పత్రాల కేసులో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి అనర్హుడంటూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో నవాజ్ షరీఫ్ రాజకీయ జీవితం ముగిసినట్లే.

Similar News