వందల ఏళ్ల నిరీక్షణ నేడు ఫలించింది

కోట్లాది మంది హిందువులకు అయోధ్యలో రామాలయ నిర్మాణం ముఖ్యమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజల సంకల్ప బలంతోనే రామాలయ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. భూమి పూజ [more]

Update: 2020-08-05 08:33 GMT

కోట్లాది మంది హిందువులకు అయోధ్యలో రామాలయ నిర్మాణం ముఖ్యమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజల సంకల్ప బలంతోనే రామాలయ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. భూమి పూజ తర్వాత మోదీ ప్రసంగించారు. జై శ్రీరాం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ హనుమంతుడి ఆశీస్సులతో నేడు రామాలయ భూమి పూజ జరిగిందన్నారు. రాముడి కార్యక్రమాలన్నీ హనుమంతుడే చేస్తారని మోదీ తెలిపారు. జైశ్రీరాం నినాదాలు నేడు విశ్వమంతా వినిపిస్తున్నాయని మోదీ తెలిపారు. వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఫలించిందన్నారు. రామమందిరం కోసం ఎంతమందో పోరాటాలు చేశారన్నారు. వారి సంకల్పానికి ప్రతిఫలం దక్కిందన్నారు. దేశ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. ఎంతోమంది త్యాగాలతో నేడు రామమందిరం నిర్మాణం జరుగుతోంది. రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం తన అదృష్టమని నరేంద్ర మోదీ అన్నారు.

Tags:    

Similar News