బాస్టర్డ్ అని అనలేదు

తాను మార్షల్స్ ను ఉద్దేశించి బాస్టర్డ్ అని అనలేదని, వాట్ నాన్సెన్స్ అని మాత్రమే తాను అన్నానని చంద్రబాబు సభలో చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ప్రయత్నించానన్నారు [more]

Update: 2019-12-13 05:35 GMT

తాను మార్షల్స్ ను ఉద్దేశించి బాస్టర్డ్ అని అనలేదని, వాట్ నాన్సెన్స్ అని మాత్రమే తాను అన్నానని చంద్రబాబు సభలో చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను ప్రయత్నించానన్నారు చంద్రబాబు. గతంలో తన పట్ల ఎంత అమార్యాదకరంగా వైసీపీ నేతలు ప్రవర్తంచిందీ అందరికీ తెలుసునన్నారు. ఒక మంత్రి అయితే నీ అమ్మ మొగుడా? అని తనను అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తాము ముందుకు వెళ్తామన్నారు చంద్రబాబు. ఉన్మాది పాలన ఉండకూడదనే తాను అన్నానని చంద్రబాబు తెలిపారు. తనను చెప్పు తీసి కొట్టమన్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. తాను ఎప్పుడూ పద్ధతిగానే ఉంటానన్నారు. తనకు జరిగిన అవమానానికి ఎవరు విచారం వ్యక్తం చేస్తారన్నారు.

Tags:    

Similar News