నన్నపనేనీ…? ఏంటిది?

చలో ఆత్మకూరు పిలుపుతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా టీడీపీ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడును పోలీసులు గృహనిర్భందం చేశారు. దీంతో చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నాయకులు నన్నపనేని రాజకుమారి [more]

Update: 2019-09-11 08:08 GMT

చలో ఆత్మకూరు పిలుపుతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా టీడీపీ అధ్యక్షులు నారాచంద్రబాబునాయుడును పోలీసులు గృహనిర్భందం చేశారు. దీంతో చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నాయకులు నన్నపనేని రాజకుమారి తో పాటు మరికొందరు మహిళా నాయకులు చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో నన్నపనేని రాజకుమారి అక్కడున్న మహిళా పోలీసులపై దురుసుగా మాట్లాడారు.

మనస్తాపం చెందిన ఎస్ఐ…..

సాటి మహిళ అని కూడా చూడకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ అనురాధ మనస్తాపం చెందారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన నన్నపనేని తోటి మహిళా పోలీసుపై ఇలా మాట్లాడడం సరికాదని సదరు ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News