చేప తినాలంటే అంత చెల్లించాల్సిందేనా?

మృగశిర కార్తె అంటే తప్పనిసరిగా చేపలు తింటారు. ఇది ఒక సెంటిమెంట్ . దీనిని క్యాష్ చేసుకోవడానికి చేపల వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే [more]

Update: 2020-06-07 05:36 GMT

మృగశిర కార్తె అంటే తప్పనిసరిగా చేపలు తింటారు. ఇది ఒక సెంటిమెంట్ . దీనిని క్యాష్ చేసుకోవడానికి చేపల వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. రేపు మృగశిర కార్తె కావడం తో చేపల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అంతేకాదు 200 రూపాయలు దొరికే కొర్ర మీను దాదాపుగా వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు. హైదరాబాద్ లోని అన్ని మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది . దీనికి తోడు ఇవాళ ఆదివారం కావడంతో ఈ ధరను మరింత పెంచి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చేపల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని కొందరు కోరుతున్నారు. సాధారణ ధర కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చేపల మార్కెట్ లో అన్ని కూడా బిజీగా ఉన్నాయి. చేపల కొనుగోలుదారుల తో రద్దీ పెరిగిపోయింది. రేపు మృగశిర కార్తె సందర్భంగా ముందస్తు అమ్మకాలు జరుగుతున్నాయి . ఒక్కసారిగా చేపల రేటు పెంచడంతో కొనుగోలుదారులు కొనలేని స్థితిలో ఉన్నారు.

Tags:    

Similar News