విమానాన్ని ఆపేసిన దోమలు.. వీడియో చూశారా..

మిల్లిమీటర్ సైజులో ఉండే దోమ పెద్ద విమానాన్ని ఆపేసింది. ఇంతకీ ఈ విచిత్ర విషయం అసలు ఎక్కడ జరిగింది..?

Update: 2023-10-14 05:22 GMT

విమానంలో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చి ప్రయాణం ఆగిపోవడం, లేదా వాతావరణం సరిగ్గా లేక విమానం టేక్ ఆఫ్ అవ్వలేకపోవడం వంటివి మీరు వినే ఉంటారు. కానీ ఒక దోమల దండు వల్ల విమానం టేక్ ఆఫ్ అవ్వకుండా ఆగిపోయిన సంఘటన ఎక్కడైన విన్నారా..? అవును అలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది. మిల్లిమీటర్ సైజులో ఉండే దోమ పెద్ద విమానాన్ని ఆపేసింది. ఇంతకీ ఈ విచిత్ర విషయం అసలు ఎక్కడ జరిగింది..?

మెక్సికోలో ఈ సంఘటన చోటు చేసుకొంది. పాసెంజర్ ఫ్లైట్ అయిన వోలారిస్ విమానం.. ఉ.4.30 గంటలకు గువాడలహార నుంచి మెక్సికో సిటీకి బయలుదేరడానికి సిద్ధంగా రన్ వే మీద ఉంది. అయితే విమానంలోకి ప్రయాణకులతో పాటు దోమల గుంపు కూడా ప్రవేశించింది. ఒకసారిగా దోమలు గుంపు ఫ్లైట్ లోకి రావడంతో ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక విమాన సిబ్బంది ఆ దోమలను బయటకి తరమడానికి తీవ్రంగా కష్టపడ్డారు.
కీటకాలను నివారించే స్ప్రేలను తీసుకోని దోమల పై యుద్ధం చేయడం మొదలు పెట్టారు. దీంతో విమానం మొత్తం స్ప్రే కారణంగా తెల్లని పుగతో కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని ఫ్లైట్ లోని పాసెంజర్స్ వీడియోలు తీశారు. ఆ వీడియోలో.. దోమల పై యుద్ధం చేస్తున్న విమాన సిబ్బందిని ప్రయాణికులు అభినందిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కాగా మెక్సికన్ దేశీయ విమానంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదేమి మొదటిసారి కాదని స్థానిక మీడియా పేర్కొంది. 2019లో వోలారిస్ విమానంలో ఇలాంటి దోమల బెడద సంభవించిందని తెలియజేస్తున్నారు. ఎయిర్‌పోర్టు లొకేషన్ వరదలు మరియు సమృద్ధిగా వృక్షసంపద ఉన్న ప్రాంతంలో ఉండడమే దీనికి కారణం అవుతుందని స్థానిక మీడియా చెబుతుంది.


Tags:    

Similar News