Weather Update : వర్షాలు వర్షాలు అంటారు కానీ.. ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయిగా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది

Update: 2025-04-17 04:37 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే అవకాశముందని, ఇదే సమయంలో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పిడుగులు పడతాయని, రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది.

వడగళ్ల వాన పడుతుందని...
అయితే కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. వడగళ్ల వాన పడే అవకాశముంందని, మామిడి, నిమ్మ, బత్తాయి వంటి రైతులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రకమైన వాతావరణం ఉందని, అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతాయని కూడా తెలిపింది. నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడనున్నాయి. చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు, సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
తెలంగాణలోనూ రెండు రోజులు...
తెలంగాణాలో మరో రెండు రోజుల పాటు వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. గంటలకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని చెప్పింది. రానున్న రెండు రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు పడతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పగటి పూట సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.


Tags:    

Similar News