Weather Alert : అలెర్ట్.. అందరూ జాగ్రత్తగా వినండి.. ఈరోజు ఎక్కడెక్కడ పిడుగులు పడతాయంటే?

వాతావరణ శాఖ ఎప్పటికప్పడు తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్ జారీ చేసింది. నేడు కూడా వర్షాలు పడతాయని తెలిపింది

Update: 2025-04-21 04:52 GMT

వాతావరణ శాఖ ఎప్పటికప్పడు తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్ జారీ చేసింది. నేడు కూడా వర్షాలు పడతాయని తెలిపింది. ఇప్పటికే కొన్ని రోజుల నుంచి పగలు ఎండ సాయంత్రానికి వానతో విభిన్నమైన వాతావరణం నెలకొని ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలతో పెనం మీద అట్టుడికినట్లు ప్రజలు ఉడికిపోతుంటే..సాయంత్రానికి కూల్ వాతావారణం పలుకరిస్తూ స్వాంతన చేకూరుస్తుంది. చల్లటి గాలులు పలకరిస్తున్నాయి. ద్రోణి ప్రభావంతోనే నేడు కూడా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.

ఈదురుగాలులతో కూడి...
ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలపడంతో సాయంత్నరానికి గంటకునలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని చెప్పింది. రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా అరటి, మామిడి, బత్తాయి, నిమ్మ తోటలు వేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.
పిడుగులు పడతాయని...
తెలంగాణలోనూ నేడు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు నలభై నుంచినలభై నాలుగుడిగ్రీల వరకూ నమోదవుతాయని, సాయంత్రానికి 30 డిగ్రీలకు తగ్గిపోతుందనితెలిపింది. అదే సమయంలో వర్షాలుకూడా పడతాయని, కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముందనిచెప్పడంతో పాటు కొన్ని జల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వడగండ్ల వాన కూడా పడుతుందని, అప్రమత్తంగా రైతులు ఉండాలని సూచించింది. ఈరోజు విభిన్నమైన వాతావరణం ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్ లాంటి చోట్ల కుండపోత వర్షం పడే అవకాశముందని కూడా తెలిపారు.
ద్రోణి ప్రభావంతో...
ద్రోణి ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలకు వర్షసూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న కూడా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు వర్షసూచన చేసింది. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Tags:    

Similar News