Rk : ఆర్కే మృతి పై భార్య పద్మక్క ఏమన్నారంటే?

ప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని భార్య శిరీష అలియాస్ పద్మక్క తెలిపారు. శిరీష ప్రకాశం జిల్లాలోని ఆలకూరపాడులో ఉంటున్నారు. తనకు [more]

Update: 2021-10-14 15:04 GMT

ప్రముఖ మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని భార్య శిరీష అలియాస్ పద్మక్క తెలిపారు. శిరీష ప్రకాశం జిల్లాలోని ఆలకూరపాడులో ఉంటున్నారు. తనకు ఆర్కే మృతిపై ఎలాంటి సమాచారం లభించలేదని ఆమె చెబుతున్నారు. విరసం నేత కల్యాణరావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్కే చనిపోయారని, ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

సెంట్రల్ కమిటీలో పదేళ్లుగా….

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే విరసం నేత వరవరరావు తోడల్లుడు. ఆయన మూడు దశాబ్దాల క్రితమే మావోయిస్టు పార్టీలో చేరి కీలకమైన పదవుల్లో ఉన్నారు. దాదాపు దశాబ్ద కాలం నుంచి సెంట్రల్ కమిటీలో ఆయన ఉన్నారు. ఆర్కే కుమారుడు కూడా బలిమెల పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఆర్కే మరణంపై ఇటు మావోయిస్టులు, అటు పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఆర్కే మరణించారని మాత్రం బస్తర్ పోలీసులు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని మీడియా కూడా ఆర్కే మృతి చెందినట్లు వెల్లడించింది.

Tags:    

Similar News