ఎమ్మెల్యే మంచి రెడ్డి పై కేసు నమోదు
బిజెపి ఎంపీపీ సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్మా సిటీ రోడ్డు ప్రారంభోత్సవ [more]
బిజెపి ఎంపీపీ సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్మా సిటీ రోడ్డు ప్రారంభోత్సవ [more]
బిజెపి ఎంపీపీ సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్మా సిటీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భూమి పూజ చేయడానికి వచ్చిన మంచి రెడ్డి తనకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా అక్కడ భూమి పూజ ప్రారంభంలో పాల్గొన్నారన్నారు. అంతేకాకుండా అక్కడకు వచ్చిన తనపై అనుచితంగా వ్యవహరించడమే కాకుండా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా తనతో దురుసుగా ప్రవర్తించారని బిజెపి ఎంపిపి సుకన్య ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దురుసుగా ప్రవర్తించిన ఇబ్రహీంపట్నం ఏసిపి తోపాటు ఇన్స్ పెక్టర్ల పై కూడా ఫిర్యాదు చేసింది. బిజెపి ఎంపిపి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పై కేసు నమోదు చేయడమే కాకుండా ఇబ్రహీం పట్నం ఏసీపీ తో పాటు ఇతర ఇన్స్ పెక్టర్ల పై కూడా కేసు నమోదు చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు.