ఇలా బయటపడాలి అంటూ...ప్రాణాలు కోల్పోయింది

Update: 2018-07-13 06:16 GMT

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఎలా తప్పించుకోవాలో చూపించడానికి చేసిన మాక్ డ్రిల్ ఓ విద్యార్థిని బలి తీసుకుంది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ఆండ్ సెన్స్ కళాశాలలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించింది. ఇందుకు గానూ ముందే 40 మంది విద్యార్థిలను ఎంపిక చేసి వారికి తగు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా గురువారం కళాశాల ప్రాంగణంలో ఒక్కో విద్యార్థిని భవనం రెండో అంతస్థు నుంచి కిందకు తోశారు. వీరిని కింద ఉన్న విద్యార్థులు వల సాయంతో ఎటువంటి గాయాలు కాకుండా కాపాడాలి.

ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే...

ఈ మాక్ డ్రిల్ లో భాగంగా కొంత మంది విద్యార్థులను క్షేమంగా కిందకు తోసిన తర్వాత అలందూరికి చెందిన బీబీఏ రెండో సంత్సరం విద్యార్థిని లోగేశ్వరి(19)ని కిందకు తోశారు. అయితే, లోగేశ్వరి అప్రమత్తంగా లేకపోవడంతో ఆమె తల మొదటి అంస్థు కింద ఉన్న సెల్ఫ్ కి బలంగా తాకింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో కళాశాలలో, లోగేశ్వరి కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, ఈ ఘటనకు కారకుడిగా శిక్షకుడు అర్ముగంపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Similar News