టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది రెబల్‌ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన స్పీకర్‌, ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. తాజాగా వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-02-27 14:42 GMT

వారిపై అనర్హత వేటు వేసేసిన ఏపీ స్పీకర్

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )  

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

కోహ్లీ గురించి ఆ మాట చెప్పిన గవాస్కర్.. ఊహించుకోలేకపోతున్న అభిమానులు

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే! రెండో బిడ్డ జననం కోసం ఈ సిరీస్‌ మొత్తానికి విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. ఇటీవలే విరాట్‌ కోహ్లీ- అనుష్క దంపతులకు అబ్బాయి జన్మించాడు. విరుష్క దంపతులు కొన్నేళ్ల క్రితం వామికకు జన్మనిచ్చారు.

Narendra Modi Gaganyan:భారతదేశం అంతరిక్షంలోకి పంపిస్తున్న వ్యోమగాములు వీరే!!

ప్రధాని నరేంద్ర మోదీ గగనయాన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రపంచానికి తెలియజేసారు. గగన్‌యాన్ మిషన్ వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ నలుగురు భారతీయ వైమానిక దళ అధికారులు..

వారిపై అనర్హత వేటు వేసేసిన ఏపీ స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది రెబల్‌ ఎమ్మేల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై విచారణ జరిపిన స్పీకర్‌, ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. తాజాగా వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Telangana GruhaJyothi: వారికే 500 రూపాయలకు సిలిండర్.. ఈ విషయాలు తెలుసుకోండి!!

Telangana GruhaJyothi:తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు సిలిండర్లను అందించనుంది ప్రభుత్వం. అయితే మహాలక్ష్మి పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది.. జరిగిపోయిందంతే!!

నెల్లూరులో సంచలనం రేపిన ఓ వ్యక్తి హత్యకేసు వెనుక.. పాత కక్షలు, వివాదాలు ఉన్నాయని అందరూ నమ్మేశారు. కానీ జరిగింది తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ హత్య చేయించింది ఆ వ్యక్తి భార్య. భార్య చంపేయాలని అనుకుంది.. జరిగిపోయింది. భార్య కళ్లెదుటే భర్తను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా చంపారని అనుకున్నారు..

హనుమ విహారి వివాదంపై చంద్రబాబు సంచలన ట్వీట్

ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని హనుమ విహారి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఏపీ పాలిటిక్స్‌లో దుమారం రేపింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘వైఎస్సార్‌సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు. హనుమవిహారి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్.

Anamika Bishnoi:భార్య ఇన్‌స్టాగ్రామ్ సెలెబ్రిటీ.. భర్త ఎందుకు చంపేశాడంటే?

Anamika Bishnoi:ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అనామికా బిష్ణోయిని ఆమె భర్త తుపాకితో కాల్చి చంపాడు. రాజస్థాన్‌లోని ఫలోడీలో జరిగిందీ ఘటన. గదిలో కూర్చున్న భార్యను అతి సమీపం నుంచి తుపాకితో కాల్చడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. భర్త చేతిలో హతమవడానికి ముందు ఆమె తన ఫాలోవర్లతో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడింది.

Bandi Sanjay vs Ponnam Prabhakar:బండి సంజయ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్.. అసలేమి జరుగుతోంది?

Bandi Sanjay vs Ponnam Prabhakar:మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని.. అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయాలకు దూరం అవ్వడానికి పొన్నం రెడీనా అని సంజయ్ సవాల్ విసిరారు.

కేటీఆర్ అందుకే అమెరికాకు వెళ్లారన్న బండ్ల గణేష్

Bandla Ganesh Fires On KTR:తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకోనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. కేసీఆర్ అబ్బాయిగా తప్ప కేటీఆర్ కి ఎలాంటి గుర్తింపు లేదన్నారు బండ్ల గణేష్. రేవంత్ రెడ్డి ఒక పోరాట యోధుడు..


Tags:    

Similar News