టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

పాల సముద్రంలో మోదీ పర్యటన, గూగూల్‌ కొత్త ఫీచర్‌.. పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల.. ప్రభాస్ పేరు మార్చుకున్నాడా..

Update: 2024-01-16 12:45 GMT

Latest Top 10 Telugu News 16-1-24

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Kanuma : నేడు కనుమ ఇక కాస్కో నా రాజా

సంక్రాంతి పండగ పర్వదినాల్లో మూడో రోజైన కనుమను నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. దీనిని పశువుల పండగగా కూడా భావిస్తారు. తమకు పాడితో పాటు పంటలు చేతికందడానికి ఉపయోగపడే పశువులను నేడు పూజిస్తారు.

Houthi Rebels : దాడులు చేసి తీరతాం.. కాచుకోండి అంటున్న హౌతీ రెబల్స్

ఎర్ర సముద్రంలో మరోసారి కలకలం రేగింది. హౌతీ రెబల్స్ ధాటికి అమెరికా షిప్ లో మంటలు చెలరేగాయి. హౌతీ రెబల్స్ వరస దాడులు జరుపుతున్నారు. యెమన్ తీరంలో అమెరికాకు చెందిన కంటెయినర్ షిప్ గిబ్రాల్టర్ ఈగల్ పై హౌతీ రెబల్స్ దాడి చేశారు. బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేయడంతో షిప్ లో మంటలు అలుముకున్నాయి.


Kalvakuntla Kavitha : కవితక్కకు కష్టాలేనా.. రానంటే ఈసారి కుదురుతుందా?

బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని నిన్న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.


Sankranthi : ఉచిత ప్రయాణం అన్నా సరే.. ఆదాయంలో రారాజు టీఎస్ఆర్టీసీ.. ఒక్కరోజు ఆదాయం ఎంతంటే?

సంక్రాంతి పండగకు టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. దాదాపు నాలుగువేల స్పెషల్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండగ కోసం నడిపిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి ముందు ఒక్కరోజులోనే అంటే ఈ నెల 13వ తేదీన టీఎస్ఆర్టీసీకి పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


శాస్త్ర ప్రకారం ప్రతిష్ట జరగడం లేదు

మరో వారం రోజుల్లో అయోధ్యలో రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న వేళ మరో వివాదం తలెత్తింది. దేశంలోని నాలుగు అద్వైత మఠాలకు చెందిన ఆధిపతులు రామ మందిర పునః ప్రతిష్టకు హాజరు కావడానికి సుముఖంగా లేరు.


Prabhas : హిట్ కోసం ప్రభాస్ పేరు మార్చుకున్నాడా.. ఈ కొత్త మార్పు ఏంటి

సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది సక్సెస్ కోసం జ్యోతిష్యం, న్యూమరాలజీ నమ్మి తమ ఒరిజినల్ పేరుని మార్చుకొని స్క్రీన్ పై మరో పేరుతో పరిచయం అవుతుంటారు. కొంతమంది కెరీర్ మధ్యలో కూడా పేరుని మార్చుకుంటుంటారు.


Google: గూగూల్‌ కొత్త ఫీచర్‌.. ఇలా చేస్తే టోల్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు

Toll Tax: జాతీయ రహదారులపై కారులో ప్రయాణించేటప్పుడు టోల్‌ ప్లాజా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైవేపై వెళ్తుంటే చాలా ప్రాంతాల్లో ఈ టోల్‌గేట్లు ఉంటున్నాయి. ఒక్కోసారి టోల్‌ట్యాక్స్‌ చెల్లించకుండా తప్పించుకోవాలని చూసినా కుదరని పరిస్ధితి ఉంటుంది.

Big Breaking : పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల.. ఏఐసీసీ కీలక ప్రకటన

వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అనుకున్నదే అయినా ఇంత త్వరగా ఈ ఉత్తర్వులు వెలువడతాయని ఎవరూ ఊహించలేదు. అయితే నిన్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామాతో ఆమె నియామకం ఖారారయిందన్న వార్తలు వచ్చాయి.


Narendra Modi : పాల సముద్రంలో మోదీ పర్యటన ఇలా

ప్రధాని నరేంద్రమోదీ పర్యటన శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతుంది. తొలుత లేపాక్షిని సందర్శించిన మోదీ అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Blood Pressure: బీపీ అదుపులో ఉండాలా..? ఈ కూరగాయను పచ్చిగా తీసుకోండి

అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి మన అనారోగ్యకరమైన జీవనశైలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. కొన్ని ఆహారాలు మన శరీరంలో రక్తపోటు లేదా బిపిని నియంత్రించడంలో సహాయపడతాయి. వాటిలో టొమాటో ఒకటి.


Tags:    

Similar News