నేడు చివరి టెస్ట్.. గెలిస్తేనే?

భారత్ - ఆస్ట్రేలియా చివరి టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

Update: 2023-03-09 03:22 GMT

భారత్ - ఆస్ట్రేలియా చివరి టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్‌లో విజయం సాధించేందుకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. భారత్ - ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్ లలో 2 -1 స్కోరుతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం దక్కుతుంది.

బ్యాటర్లు రాణిస్తేనే...
అదే ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమంగా ముగుస్తుంది. మూడు టెస్ట్‌లలో భారత బ్యాటర్లు విఫలమయ్యారనే చెప్పాలి. టాప్ ఆర్డర్ నుంచి ఎవరూ పెద్దగా ఆడలేకపోయినందునే స్కోరు చేయలేకపోయారు. భారీ స్కోరు చేయలేకపోయినా బౌలర్లు రాణించడంతో రెండు టెస్ట్‌లలో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ లో బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించగలిగితే సులువుగా విజయం సొంతమవుతుంది.
మోదీతో పాటు...
ఈ మ్యాచ్ ను ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్టనీస్ ప్రత్యక్షంగా తిలకించనున్నారు. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ అది పెద్ద స్టేడియం. ఈ స్టేడియానికి తన పేరు పెట్టిన తర్వాత తొలిసారి హాజరవుతుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాలకు చెందిన ప్రధానులు స్టేడియం మొత్తం తిరుగుతారు.


Tags:    

Similar News