ఛాయిస్ లక్ష్మీపార్వతిదే..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిప్పలు తప్పేలా లేవు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కునే అవకాశం ఉంది. ఇప్పటికే వరకు ఆయనకు [more]

Update: 2019-04-26 08:28 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిప్పలు తప్పేలా లేవు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కునే అవకాశం ఉంది. ఇప్పటికే వరకు ఆయనకు ఆక్రమాస్తులు ఉన్నాయని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పలువురు కోర్టులకు వెళ్లినా చంద్రబాబుపై విచారణ జరగలేదు. పలుమార్లు ఆయన కోర్టులకు వెళ్లి తనపై విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దాఖలు చేసిన పిటీషన్ ను విచరించిన కోర్టు సీబీఐ విచారణకు సైతం ఆదేశించినా చంద్రబాబుపై విచారణ జరగలేదు. తమ వద్ద సిబ్బంది లేరని, ఇప్పుడు విచారించడం సాధ్యం కాదని సీబీఐ అప్పట్లో కోర్టుకు సమాధానం ఇచ్చింది. తర్వాత చంద్రబాబు ఈ కేసులో స్టే తెచ్చుకున్నారు.

కోర్టుకు హాజరైన లక్ష్మీపార్వతి…!

కాగా, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారాయి. దీర్ఘకాలికంగా ఉన్న స్టేలను రద్దు చేయాలని సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో చంద్రబాబు 2005లో తెచ్చుకున్న ఓ స్టే రద్దయ్యింది. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి చంద్రబాబుపై ఏసీబీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పలు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఆయనపై విచారణ జరపాలని కోరారు. కానీ, విచారణ జరగకుండా చంద్రబాబు అప్పట్లో స్టే తెచ్చుకున్నారు. ఇటీవలి సుప్రీం ఆదేశాలతో చంద్రబాబుపై ఉన్న స్టే రద్దయ్యింది. దీంతో తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఫిర్యాదుదారు అయిన లక్ష్మీపార్వతిని కోర్టు ఆదేశించింది.

విచారణను ఎదుర్కుంటారా..?

ఇవాళ ఆమె కోర్టుకు హాజరుకాగా… చంద్రబాబుపైన కేసును ఉపసంహరించుకుంటారా లేదా విచారణ కోరుతారా అని కోర్టు ఆమెను ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఛాయిస్ లక్ష్మీపార్వతి చేతిలో ఉంది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 13కు కోర్టు వాయిదా వేసింది. లక్ష్మీపార్వతి కేసును కొనసాగించేందుకు మొగ్గు చూపితే చంద్రబాబుపై మొదటిసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ కేసుపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఒకవేళ ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశించినా చంద్రబాబు పైకోర్టును ఆశ్రయిస్తారా లేదా విచారణను ఎదుర్కుంటారా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News