నీటి పంపకాలపై కృష్ణా ట్రైబ్యునల్ లో?

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణ జరిగింది. వరసగా మూడో [more]

Update: 2021-03-20 01:04 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణ జరిగింది. వరసగా మూడో రోజు కొనసాగిన తెలంగాణ తరపు సాక్షిగా ఉన్న సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఘన్ శ్యామ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి ప్రశ్నలకు ఘన శ్యామ్ సమాధానం ఇచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కేసీ కెనాల్, పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు తరలింపు వంటి అంశాలపై మూడు రోజుల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. వచ్చే నెల 28, 29, 30 తేదీలకు తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది.

Tags:    

Similar News