ఆ జీవో అభ్యంతరకరమే.. వివరణ ఇవ్వాల్సిందే?
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 203 సరికాదని బోర్డు పేర్కొంది. [more]
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 203 సరికాదని బోర్డు పేర్కొంది. [more]
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 203 సరికాదని బోర్డు పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి బోర్డు లేఖ రాసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఈ జీవో విరుద్ధమని ఆ లేకలో పేర్కొంది. పునర్విభజన చట్టం ప్రకారం, 11వ షెడ్యూల్ ను అనుసరించి కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించరాదని పేర్కొంది. అపెక్స్ కమిటీ అనుమతిని పొందకుండా ఏపీ ప్రభుత్వం జీవో తేవడం పట్ల కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆక్షేపించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.