మంత్రి పదవికి కిడారి శ్రావణ్ రాజీనామా

మంత్రి కిడారి శ్రావణ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంపై గౌరవంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు హుటాహుటిన బయలుదేరి అమరావతికి [more]

Update: 2019-05-09 11:45 GMT

మంత్రి కిడారి శ్రావణ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంపై గౌరవంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు హుటాహుటిన బయలుదేరి అమరావతికి వచ్చిన ఆయన చంద్రబాబు పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉండటంతో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. రేపటి లోగా తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఉండటంతో రాజీనామా చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందించారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలలోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. కిడారి శ్రావణ్ మంత్రిగా ప్రమాణం చేసి రేపటికి ఆరు నెలలు. అయినా ఆయన ఏ సభలోనూ సభ్యుడిగా లేనందున రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో కిడారి శ్రావణ్ అరకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

Tags:    

Similar News