తెలంగాణ ద్రోహితో పొత్తా..!

Update: 2018-10-03 12:47 GMT

అహోరాత్రులు తాము కష్టపడి, కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేస్తుంటే... కాంగ్రెస్ దుర్మార్గులు ప్రజల మనస్సులు ఖరాబ్ చేస్తున్నారని... అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారని.. అందుకే ప్రజా తీర్పు కోరి ముందస్తు ఎన్నికలకు వచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అమరావతికి, ఢిల్లీకి తెలంగాణ గులాంగా ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించుకోవాలంటే ప్రజలంతా టీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలని కోరారు.

కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

- తెలంగాణ మొదటినుంచి మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణను ఆంధ్రలో కలిపింది నెహూ అయితే... తెలంగాణ అడిగినందుకు 300 మందిని చంపింది ఇందిరా గాంధీ.

- కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా తెలంగాణను నాశనం చేసి, ఎన్ కౌంటర్ల పేరుతో తెలంగాణ బిడ్డలను మింగిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటున్నారు. థూ.. నాలుగు సీట్లు అడిగితే నేను ఇచ్చేటోడిని.

- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దాచి దాచి దయ్యాల పాల్జేసినట్లు చంద్రబాబుకు అప్పజెప్తామా అని ప్రజలు ఆలోచించుకోవాలి.

- నేను చావు నోట్లో పెట్టి తెచ్చిన తెలంగాణ మళ్లీ అమరావతికి గులాంగిరి చేయాలా..? ఢిల్లీకి గులాంగిరి చేయాలా..?

- తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదని గులాం నబీ ఆజాద్ అన్నాడు. ఆ మాట విని రాయి తీసుకుని నెత్తి పలగ్గొట్టుకోవాలనిపించింది. మరి నా పాత్ర లేకుండా గులాం నబీ ఆజాద్ అయ్య పాత్ర ఉందా..?

- తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రచారం కోసం చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తారంట. మూడు హెలీకాఫ్టర్లు బుక్ చేసిర్రంట. మళ్లీ చంద్రబాబును తెలంగాణలో ఈ కాంగ్రెసోళ్లు ఊరేగిస్తరంట.

- ఏడు తెలంగాణ మండలాలను, సీలేరు విద్యుత్ కేంద్రాన్ని మన నుంచి గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తా..? ఎంత దుర్మార్గం..?

- 70-80 ఏళ్ల ముందు నిజామాబాద్, తెలంగాణకు వచ్చి స్థిరపడ్డ ఆంధ్ర ప్రజలను తెలంగాణవారిగానే గుర్తిస్తాం.

- బీజేపీ అనే పార్టీ ఇళ్ల కిరాయిలు కడతరంట. ప్రపంచంలోనే ఈ పథకం ఎక్కడ లేదు. 2014లో విదేశాల నుంచి నల్లదనం తెచ్చి మనిషి రూ.15 లక్షలు వేస్తమని మోదీ చెప్పిండి. ఆ 15 లక్షలు మాకు ఇయ్యి మేమే మీ కిరాయి కడతాం.

- ఉత్తమ్ నన్ను బట్టేబాజ్ అన్నాడు, ఎవరు బట్టేబాజో ప్రజలే చెప్పాలి. నేను తిట్ట దలుచుకుంటే తెల్లారే దాక తిడతా. కానీ, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున అలా మాట్లాడలేను.

- దేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నది తెలంగాణలోనే.

- మేము అధికారం చేపట్టే నాటిని రాష్ట్రంలో అన్నీ సంక్షోభాలే.. వాటన్నిట్నీ అధిగమించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.

- 42 వేల కోట్లతో 452 సంక్షేమ పథకాలు చేపట్టాం. ఇంటింటికీ నీళ్లిస్తున్నాం. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సహాయం అందిస్తున్నాం,

Similar News