కన్నా తో మోడీ ఏమన్నారంటే?

Update: 2018-06-12 14:14 GMT

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ప్రధాని మోడీని కలిసి 12 అంశాలను సత్వరమే పరిష్కరించాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితిని కన్నా ప్రధాని మోడీకి వివరించారు. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, రామాయపట్నం పోర్టు, విజయవాడ, విశాఖ మెట్రో రైలు, వెనుక బడిన జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు 150 కోట్ల రూపాయలు కేటాయించాలని కన్నా ప్రధానిని కోరారు. కన్నా వినతి పట్ల ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మోసం చేసినా ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ కన్నాతో అన్నట్లు తెలిసింది. ఏపీ ప్రజలు తనకు ముఖ్యమని చంద్రబాబు కాదని ఆయన అన్నట్లు సమాచారం. బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని కన్నాను మోదీ కోరారని చెబుతున్నారు.

Similar News