ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మోసగాడని ప్రధాని నరేంద్ర మోదీ ముందు తెలుసుకోలేకపోయాడని పేర్కొన్నారు. మంగళవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ... కేంద్రం ఇప్పటివరకు రూ. లక్ష 55 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి ఇచ్చిందని వివరించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16,800 కోట్లు ప్రకటించగానే చంద్రబాబు కేంద్రాన్ని కొనియాడారని, కానీ అవినీతి కారణంగా ఆ నిధులను తెచ్చుకోలేకపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోందని, చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలోనూ టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని ఆరోపించారు.