రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ పై టీఆర్ఎస్ ఎంపీ కవితతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తనయుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. రోజురోజుకూ ప్రజాధరణ కోల్పోవడం, ఓటమి భయం, నాపై కోపంతో ఎంపీ కవిత ఇటువంటి ఆరోపణలు చేస్తోందన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అంతర్గత లేఖలో తన పేరు, బీజేపీ పేరు తేవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన తండ్రి ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కాదని, ఆయనను అవమానించేలా మాట్లాడటం అహంకారం అన్నారు. కేసీఆర్ తన తండ్రి ఇంటికి వచ్చి పార్టీలోకి చేర్చుకున్నాడా, తన తండ్రే కేసీఆర్ ని బతిమాలి పార్టీలోకి వెళ్లాడా అనేది అందరికీ తెలసున్నారు. కాంగ్రెస్ లో చేరాలని ఆ పార్టీ పెద్దలు ఇప్పటికే తనకు ఆఫర్ చేసినా తిరస్కరించానని, భారతీయ జనతా పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.