బీజేపీ నేత చేరికతో సాగర్ ఉప ఎన్నికలో?

నాగార్జు సాగర్ ఉప ఎన్నికలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా [more]

Update: 2021-03-31 01:05 GMT

నాగార్జు సాగర్ ఉప ఎన్నికలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత కడారి అంజయ్య టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తనను కాదని రవికుమార్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో అంజయ్య పార్టీని వీడారు. అంజయ్య ప్రభావం సాగర్ ఉప ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. 2014 ఎన్నికల్లో అంజయ్య టీడీపీ నుంచి నాగార్జున సాగర్ లో పోటి చేసి మూడో స్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంజయ్య చేరికతో టీఆర్ఎస్ అభ్యర్థి బలం మరింత పెరిగిందని చెబుతున్నారు.

Tags:    

Similar News