‘పాలాక్షుని డైరీ’ సృష్టికర్త ఇక లేరు
‘ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక’లో ‘ఫాలాక్షుని డైరీ పేరిట దశాబ్దాలపాటు కాలమ్ రాసిన జొన్నలగడ్డ భూపతిరాజు ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మరణించారు. బెజవాడలో జన్మించిన ఆయన [more]
‘ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక’లో ‘ఫాలాక్షుని డైరీ పేరిట దశాబ్దాలపాటు కాలమ్ రాసిన జొన్నలగడ్డ భూపతిరాజు ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మరణించారు. బెజవాడలో జన్మించిన ఆయన [more]
‘ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రిక’లో ‘ఫాలాక్షుని డైరీ పేరిట దశాబ్దాలపాటు కాలమ్ రాసిన జొన్నలగడ్డ భూపతిరాజు ఈరోజు ఉదయం హైదరాబాద్ లో మరణించారు. బెజవాడలో జన్మించిన ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సాహితీవేత్త, బాపు-రమణలకు ఆత్మీయుడు. ఆంధ్రపత్రిక సారధులు శివలెంక శంభుప్రసాద్ గారితో సాన్నిహిత్యం ఉండేది. ఆ పరిచయం తోనే ఎన్నో సంవత్సరాల పాటు వారం వారం క్రమం తప్పకుండా ‘పాలాక్షుని డైరీ’ కాలం రాశారు. ప్రైవేటు రంగంలో చెన్నై కేంద్రం గా ఉన్న ఎంజిఎం ట్రాన్స్ పోర్టు కంపెనీలో 30 ఏళ్ళు పైగా పనిచేసి జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్లేరు. ప్రస్తుతం ఈ వయసులో కూడా కర్నాటక కేంద్రంగా ఉన్న ప్రైవేటు ట్రాన్స్ పోర్టు సంస్థలో సేవలు అందిస్తున్న ఈయన నిన్న కూడా విధులు నిర్వహించారు. వీరు పాత్రికేయ వృత్తిలో లేకపోయినా ఎంతో ఆసక్తికరంగా పాలాక్షుడి డైరీ రాసేవారు. ఆయన పేరు వచ్చేది కాదు. అంతా రచయిత పేరు పాలాక్షుడు అనుకునే వారు.