ఏపీ ప్రస్తుతం మూడో దశ ప్రారంభంలో?

ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ మూడో దశ ప్రారంభంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఇంటింటి సర్వేలో దాదాపు ఐదు [more]

Update: 2020-04-07 13:31 GMT

ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ మూడో దశ ప్రారంభంలో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఇంటింటి సర్వేలో దాదాపు ఐదు వేల మందిని గుర్తించామని చెప్పారు. విదేశాల నుంచి 29 వేల మంది వచ్చారని, మర్కజ్ నుంచి వెయ్యి మంది వరకూ ఏపీకి చేరుకున్నారని తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 280 మంది వరకూ మర్కజ్ నుంచి వచ్చినవారేనని ఆయన తెలిపారు. మూడు లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కు ఆర్డర్ ఇచ్చామన్నారు. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశం ఉందని జవహర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News