పవన్ పై జగన్ షాకింగ్ కామెంట్స్

Update: 2018-12-03 12:40 GMT

నాలుగేళ్లకు ఒకసారి భార్యను మర్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ దేశంలో పవిత్రమైన పెళ్లి అనే వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకువచ్చాడని... నిత్య పెళ్లి కొడుకులా నలుగురు భార్యలను పెళ్లి చేసుకోవడమే మగతనమా అని ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజాం బహిరంగ సభలో జగన్... పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....

- రేణూ దేశాయ్ తో కాపురం చేస్తున్నప్పుడే వేరే స్త్రీని పవన్ కళ్యాణ్ గర్భిణిని చేశారని స్వయంగా ఆమె చెప్పింది.

- ఆ మాట అన్నందుకు రేణూ దేశాయ్ ను జనసేన కార్యకర్తలు వేదిస్తే వారిని కనీసం ఆపకపోవడం మగతనమా ?

- తాను చేసిన తప్పుని ఎత్తి చూపిస్తే వారి ఇళ్లల్లోని ఆడవారిపై సోషల్ మీడియాలో సిగ్గులేకుండా ఆరోపణలు చేయించే పవన్ కళ్యాణ్ ది మగతనమా ?

- 2014 నుంచి 2018 వరకు నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబుతో కలిసి కాపురం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబుకు దూరమైనట్లు నటిస్తున్నారు.

- చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధంలోనూ, చేసిన ప్రతి అవినీతిలోనూ, మోసంలోనూ భాగమైన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబుతో విడిపోయినట్లుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు.

- చంద్రబాబు స్క్రిప్ట్ రాసి, డైరెక్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ యాక్షన్ చేస్తున్నారు. వీరి సినిమాకు లింగమనేని అనే వ్యక్తి నిర్మాత.

- చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంటర్వెళ్లు ఎక్కువ సినిమా తక్కువ.

- చంద్రబాబు ఎప్పుడు పేమెంట్ ఇస్తే ఆయనకు అనుకూలంగా అప్పుడు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇస్తుంటారు.

- ల్యాండ్ పూలింగ్ లో తన భూమి పోకుండా ప్లాన్ చేసిన లింగమనేని అందుకుగానూ ఎకరా రూ.4 కోట్లు విలువ చేసే భూమిని పవన్ కు కేవలం రూ.20 లక్షలకే ఇచ్చింది వాస్తవం కాదా?

- నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు మీద ప్రతిపక్షంగా తాము పోరాడుతుంటే, పవన్ కళ్యాణ్... చంద్రబాబుకు పార్ట్ నర్ గా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడకుండా జగన్ అవినీతి పరుడు అంటున్నారు. తాను అవినీతి చేయగా పవన్ కళ్యాణ్ చేశారా ?

- పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ఆర్ పాలన జరిగింది. ఆయన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కాబట్టే 2009లో ఓట్లేసి గెలిపించారు.

- పవన్ కళ్యాణ్ చూడని వైఎస్ పాలనలో... జరగని అవినీతి గురించి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి గురించి మాట్లాడకుండా వైఎస్ పాలన గురించి మాట్లాడటం చంద్రబాబు స్క్రిప్ట్ లో భాగం కాదా ?

- అజ్ఞాతవాసికి చంద్రబాబు ఏ సినిమాకు ఇవ్వని రాయితీలు ఇచ్చినందున కోట్లు సంపాదించింది వాస్తవం కాదా?

Similar News