బ్రేకింగ్ : ఏపీలో మరొకరు మృతి… 192కు చేరిన కేసుల సంఖ్య

కరోనా వైరస్ తో ఏపీలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 192కు చేరుకున్నాయి. ఢిల్లీీ లింకుల దెబ్బతోనే ఈ [more]

Update: 2020-04-05 03:41 GMT

కరోనా వైరస్ తో ఏపీలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 192కు చేరుకున్నాయి. ఢిల్లీీ లింకుల దెబ్బతోనే ఈ సంఖ్య పెరుగుతుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోనూ ఈ సంఖ్య 32కు చేరుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తుంది. ప్రభుత్వం ఈ మరణాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరణించిన వ్యక్తి బంగారం పనులు చేస్తుంటారని, వివిధ రాష్ట్రాలను తిరిగి రావడం వల్లనే కరోనా సోకిందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News