తెలంగాణ సర్కార్ నన్ను వేధిస్తుంది

ఐపీఎస్ అధికారి వీకే సింగ్ గత ఏడాది మే నెలలో వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. తాను జీవనోపాధి కోసం ఉద్యోగానికి రాలేదని, సేవాభావంతోనే పోలీస్ అయ్యాయని [more]

Update: 2021-03-19 00:40 GMT

ఐపీఎస్ అధికారి వీకే సింగ్ గత ఏడాది మే నెలలో వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. తాను జీవనోపాధి కోసం ఉద్యోగానికి రాలేదని, సేవాభావంతోనే పోలీస్ అయ్యాయని ఆయన చెప్పారు. తన వీఆర్ఎస్ ను ప్రభుత్వం అంగీకరించలేనది, తనకు ఛార్జి మెమో జారీ చేసిందని వీకే సింగ్ చెప్పారు. బంగారు తెలంగాణలో మంచి పోలీసు అధికారులకు విలువలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వీకే సింగ్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనను నిత్యం వేధిస్తుందని వీకే సింగ్ చెప్పారు. బంగారు తెలంగాణ కంగారు తెలంగాణాగా మారిందని చెప్పారు. తాను తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని వీకే సింగ్ తెలిపారు. ఇక్కడ కేవలం కుటంబ పాలన మాత్రమే నడుస్తుందని వీకే సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని వీకే సింగ్ తెలిపారు.

Tags:    

Similar News