తొలి కరోనా మరణం ?

భారత్‌లో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. కరోనా లక్షణాలతో మంగళవారం మరణించిన వృద్ధుడికి కరోనా సోకినట్లు కరోనా ఆరోగ్య విభాగం ప్రకటించింది. కలబుర్గికి చెందిన 76 [more]

Update: 2020-03-13 01:49 GMT

భారత్‌లో తొలి కరోనా వైరస్ మరణం నమోదైంది. కరోనా లక్షణాలతో మంగళవారం మరణించిన వృద్ధుడికి కరోనా సోకినట్లు కరోనా ఆరోగ్య విభాగం ప్రకటించింది. కలబుర్గికి చెందిన 76 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా లక్షణాలతో చనిపోయిన సంగతి తెలిసిందే. కలబుర్గికి చెందిన ఆ వృద్ధుడు ఫిబ్రవరి 29న సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా.. అతడిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. మార్చి 5న ఆస్తమా, బీపీతో అతడు కలబుర్గిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు సమాచారం. హాస్పిటల్ సిబ్బంది అతడ్ని కరోనా పరీక్షలకు పంపారని.. మూడు రోజుల తర్వాత అతణ్ని హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు షిప్ట్ చేశారని తెలుస్తోంది. అదే రోజు అతణ్ని ఇంటికి తీసుకెళ్లగా.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చనిపోయాడని సమాచారం. హాస్పిటల్ వర్గాలు కరోనా లక్షణాలున్న పేషెంట్‌ను బయటకు వెళ్లడానికి ఎలా అనుమతించాయనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News