బ్రేకింగ్ : హర్యానాలో కర్ణాటక ప్రయోగం

హర్యానాలో పరిస్థితిని గమనించిన బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా [more]

Update: 2019-10-24 05:11 GMT

హర్యానాలో పరిస్థితిని గమనించిన బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. హర్యానాలో ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీకి 39 కాంగ్రెస్ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ జేజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. దీంతో కర్ణాటక తరహా ప్రయోగం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక్కడ జేజేపీ నేత దుష్యంత్ చౌతాలాను ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ బయటనుంచి మద్దతిచ్చేలా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. దుష్యంత్ చౌతాలాను ముఖ్యమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది.

Tags:    

Similar News