ఒంటిచేత్తో పోరాటం.. ఓడినా శభాష్ బ్రేస్ వెల్

భారత్ - న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టీ 20ని తలపించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ కొనసాగింది.

Update: 2023-01-18 16:25 GMT

భారత్ - న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ టీ 20ని తలపించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ కొనసాగింది. భారత్ యాభై ఓవర్లకు 349 పరుగులు చేసినా చివరి బాల్ వరకూ నరాలు ఉత్కంఠ నెలకొంది. బ్రేస్ వెల్ చూపిన ఆట తీరు అద్భుతంగా కనిపించింది. న్యూజలాండ్ ఒక దశలో వికెట్లను కోల్పోయి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని భావించారు. కానీ బ్రేస్ వెల్ మాత్రం సెంచరీ పూర్తి చేయడమే కాదు న్యూజిలాండ్ ను ఒంటి చేత్తో గెలిపించేలా కనిపించాడు.

ప్రతి బాల్ కు ఉత్కంఠ...
దీంతో ప్రతి బాల్ కు నరాలు తెగే ఉత్కంఠ ఏర్పడింది. ఎనిమిది వికెట్లు కోల్పోయినా న్యూజిలాండ్ పట్టు కోల్పోయినట్లు కనిపంచలేదు. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించింది. సిక్సర్లు బాదుతుడటంతో ఒక దశలో న్యూజిలాండ్ గెలిచేటట్లే అనిపించింది. బ్రేస్ వెల్ బ్యాటింగ్ కు వస్తే భారత్ అభిమానులకు గుండె దడ మొదలయిందనే చెప్పాలి. సిరాస్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. చివరకు బ్రేస్ వెల్ కు భారత్ తలవంచక తప్పదని పించింది.. భారత్ బౌలర్లను చితక బాదడంతో న్యూజిలాండ్ విజయం దాదాపు ఖాయమైంది. చివరి ఓవర్ కు 20 పరుగులు అవసరమయ్యాయి. శార్దూల్ వేసిన తొలి బంతికే సిక్స్ కొట్టాడు. రెండో బాల్ వైడ్ వేశాడు. మూడో బాల్ ఎల్‌బిడబ్ల్యూ అవ్వడంతో న్యూజిలాండ్ ఓటమి పాలయింది. దీంతో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Tags:    

Similar News