సుఖేష్ గుప్తా కు ఈడీ షాక్… 222 కోట్ల జరిమానా
హైదరాబాద్ జ్యువెలరీ వ్యాపారి సుఖేష్ గుప్తా కు ఈడి భారీ షాక్ ఇచ్చింది. ఎంబిఎస్ జ్యువలరీ సుఖేష్ గుప్తా కు 222 కోట్ల రూపాయల భారీ జరిమానా [more]
హైదరాబాద్ జ్యువెలరీ వ్యాపారి సుఖేష్ గుప్తా కు ఈడి భారీ షాక్ ఇచ్చింది. ఎంబిఎస్ జ్యువలరీ సుఖేష్ గుప్తా కు 222 కోట్ల రూపాయల భారీ జరిమానా [more]
హైదరాబాద్ జ్యువెలరీ వ్యాపారి సుఖేష్ గుప్తా కు ఈడి భారీ షాక్ ఇచ్చింది. ఎంబిఎస్ జ్యువలరీ సుఖేష్ గుప్తా కు 222 కోట్ల రూపాయల భారీ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హాంకాంగ్ కు చెందిన లింక్ కంపెనీతో కలిసి సుఖేష్ గుప్తా పెద్ద ఎత్తున డైమండ్ వ్యాపారం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హవాలా ద్వారా డైమండ్ వ్యాపారం నిర్వహించిన సుఖేష్ గుప్తా తో పాటు గా ఎంబిఎస్ జ్యువెలరీ పైన ఈడీ ఫెమా కేసు నమోదు చేసింది. గతంలో ఎంబీఎస్ తో పాటు సుకేశ్ గుప్తా పై ఈడి కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఈడీ విచారణ చేసి చార్జిషీట్లు దాఖలు చేసింది. అయితే ఫెమా కేసు లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో సుఖేష్ గుప్తా తోపాటు ఎంబిఎస్ జ్యువలరీ పైన రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. ఈడీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటిసారి. అయితే హాంగ్ కాంగ్ కు చెందిన ప్రముఖ కంపెనీ లింకింగ్ తో కలిసి డైమండ్ వ్యాపారం నిర్వహించారు. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. అంతేకాకుండా అనుమతి లేకుండా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున డైమండ్ జ్యువెలర్స్ ని హాంకాంగ్ కు ఎగుమతి చేశాడు. ఈ నేపథ్యంలో హవాలా ద్వారా పెద్ద ఎత్తున నిధుల మార్పిడి జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హాంకాంగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం డైమండ్ బిజినెస్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈడీ ఫెమా కేసు నమోదు చేసి విచారణ జరిపి అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించడం నేపథ్యంలో సుఖేష్ గుప్తా తో పాటు ఎంబిఎస్ జ్యువలరీపైన భారీ జరిమానా విధిస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది