ఒక్కొక్కరిది ఒక్కో గాథ హైదరాబాద్-బెంగుళూరు బస్సు ప్రమాద క్షతగాత్రుల వ్యథ....

తల్లి, కుమార్తె మరణం సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి సూరారం వ్యాపారి ఆచూకీ తెలియలేదు

Update: 2025-10-24 09:47 GMT

సుమారు 20 మంది ని పొట్టన పెట్టుకున్న కర్నూల్ బస్సు ప్రమాదం లో హైద్రాబాదీల పరిస్థితి ఏంటని తెలుగుపోస్టు పలువురు ప్రయాణికులు ని సంప్రదించగా క్షతగాత్రులు స్పందిస్తూ తాము చాలా భయాందోలనుకు గురయ్యామని తెలిపారు. కొందరు ప్రాథమిక చికిత్స పొంది తిరిగి హైదరాబాద్ లో ని ప్రముఖ హాస్పిటల్ కి వెళ్తున్నారని తెలిపారు.

jntu లో ఎక్కిన ముగ్గురు....

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోర మండలం కు చెందిన ఎం.జి రామారెడ్డి కూతురు ని కలవడానికని బెంగుళూరు కి వెళ్తున్నారు. హైదరాబాద్ లో బంధవులను కలిసి బెంగుళూరు లో ఉంటున్న కూతురిని చూడడానికి బయల్దేరాడు. ఇంతలో ఈ సంఘటన వల్ల తల, ముక్కు, కాళ్లకు తీవ్ర గాయాలు అవటం తో కర్నూల్ లోని ఆకాష్ హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స పొంది హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ కి తనని బంధువులు తరలిస్తున్నారన్నారు.

రామారెడ్డి నిద్రలో ఉండగా ఎదో పగలగొడుతున్న శబ్దం వినపడడంతో నిద్ర లేచి చూడగ అప్పటికే వెనక ఉన్న బస్సు కిటికి అద్దాన్ని కొందరు పగలగొట్టారన్నారు. అందులో నుండి వారు దూకేశారని. తనని కూడా ఎవరో చేయి పట్టి బయటకి లాగేశారని తెలిపారు. సుమారు 2 గంటలు ప్రాంతం లో సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. పొగ మూలంగా ఆ సమయం లో ఏమి కనిపించలేదని, బయట పడడానికి ప్రయత్నించగా అంతా క్లోజ్ చేసి ఉన్నాయని తెలిపారు. ఎట్టువంటి ఆయుధాలు లేవని, బయట పడడానికి ఇద్దరు ముగ్గురు కలిసి అద్దాన్ని పగలుగొట్టారని తెలిపారు.

బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు కు చెందిన గన్నమనేని ధాత్రి తన మేన మామ ను కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చింది. ధాత్రి బెంగళూరు లోని ఓ సంస్థ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తుండగా ప్రమాదం లో మృతి చెందింది.

అమిత్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని సమాచారం.

గచ్చిబౌలి లో ఎక్కిన వారిలో.....

గచ్చిబౌలి లో ఎక్కిన శివ బెంగుళూరు వాసి. ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. సొంతింటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చేతికి చిన్న గాయాలతో బయటపడిన శివ తిరిగి బెంగుళూరు కి వెళ్తున్నారని తెలిపారు.

గ్లోరియా ఎల్సా సామ్ క్షమంగా ఉన్నారని సమాచారం.

కూకట్పల్లి వై జంక్షన్....

కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఎక్కిన జయ సూర్య కు రొండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్టుగా మా ప్రతినిధి కి తెలిపారు. జయ సూర్య కాస్త మెలుకువగ ఉంటడడం తో వాసన, పొగ ను గమినించి లేచి చూసే వారికి కొందరు మంటలు వస్తున్నాయని అరుస్తూ వెనక ఉన్న కిటికి బద్దలు కొట్టగా. కొందరు దాని లో నుండి బయటికి దూకేశారని. తాను కూడా ఆ కిటికి నుండి బయటికి దూకేశానని తెలిపారు.

మరో ఇద్దరి మహిళల మృతి చెందారు. మెదక్ శివాయిపల్లి కి చెందిన తల్లి, కూతురు సంధ్య రాణి, చందన. కూతుర్ని బెంగుళూరు లో దించి తాను మస్కట్ వెళ్లాలని సంధ్య నిర్ణయం. సంధ్య  భర్త తో మస్కట్ లో ఉంటారని తెల్సుతుంది. ఓ పెళ్లి వేడుక లో పాల్గొనడానికి వచ్చిన భార్య భర్తలు.వారం ముందే భర్త మస్కట్ కు వెళ్లిపోయారు. సంధ్య  జ్వరం కారణంగా మస్కట్ ప్రయాణం వాయిదా పడిందని తెలుస్తుంది.

సూరారం...

ప్రశాంత్ రొండు నెలల ముందు పుట్టిన తన కొడుకుని చూసుకోడానికి బెంగుళూరు ప్రయాణమయ్యారు. ప్రశాంత్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ సమాధానమివ్వడం లేదు. మరో నెంబర్ కు ప్రయత్నించగా సత్యశ్రీ ట్రావెల్స్ వారు మా ప్రతినిధి తో మాట్లాడారు. ప్రశాంత్ గత 15సంవత్సరాలుగా వాళ్ళ ట్రావెల్స్ నుండే టికెట్ బుక్ చేస్కునేవారని తెలుస్తుంది. ప్రశాంత్ హాట్ చిప్స్ వ్యాపారి గా సూరారం లో స్థిరపడ్డారు. రొండు నెల్ల క్రితం తన భార్య, కొడుకుని ఇదే ట్రావెల్స్ నుండి బెంగుళూరు కి పంపించినట్టు తెలిపారు.

మరో ప్రయాణికుడు గుణసాయి సురక్షితంగా బయటపడ్డారు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.

మృత్యుంజయులు వీరే...

ఎం సత్యనారాయణ(27),జయ సూర్య(24), అన్దోజ్ నవీన్ కుమార్(26), సరస్వతి హారిక(30), నేలకూతి రమేష్(36), శ్రీలక్ష్మి , జస్విత(8), అభిరా(1.8), కాపర్ అశోక్(27), ముసాలూరి శ్రీ హర్ష(25),పునుపట్టి కీర్తి(28),వేణు గోపాల్ రెడ్డి(24), ఎం.జి.రామారెడ్డి, ఘంటసాల సుబ్రహ్మణ్యం, అశ్విన్ రెడ్డి, ఆకాష్,జయంత్ కుశ్వాల్, పంకజ్ ప్రజాపతి, గుణ సాయి, శివ ,గ్లోరైయా ఎల్సా సామ్.

Tags:    

Similar News