ఉద్యోగం తప్ప అన్నీ ఇస్తారు..!

Update: 2018-08-02 11:37 GMT

హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి 25లక్షల నగదు, నకిలీ అపాయింట్ మెంట్ లెటర్స్, యూనిఫార్మ్ లు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. నాందేడ్ కి చెందిన పాత నెరస్థుడు గంగాధర్ మరో 8 మంది స్నేహితులను కలుపుకొని ముఠా గా ఏర్పడ్డాడు. స్నేహితులు, బంధువుల ద్వారా నిరుద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఒక్కొక్కరి దగ్గర నుండి 10 నుండి 25 లక్షల చొప్పున వందమంది దగ్గర వసూలు చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చి నమ్మించారు. నమ్మిన వారికి ఒరిస్సా, ఢిల్లీ, కోల్ కత్తా తీసుకుపోయి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ తరువాత ఉద్యోగాలు అనే సరికి మొహం చాటేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

Similar News