నిషా దిగింది…తప్పతాగి?

డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక్క రోజు రాత్రిలోనే దుమ్మురేపింది. తప్పతాగి వాహనాలు నడిపిన వాహనదారులకు చుక్కలు చూపించింది. తప్పించుకోవాలని ప్రయత్నించిన వారి తాట తీసింది. ఒకరు కాదు [more]

Update: 2020-01-02 01:38 GMT

డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక్క రోజు రాత్రిలోనే దుమ్మురేపింది. తప్పతాగి వాహనాలు నడిపిన వాహనదారులకు చుక్కలు చూపించింది. తప్పించుకోవాలని ప్రయత్నించిన వారి తాట తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు కేంగా మూడువేల 200 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. న్యూయర్ జోష్ కొందరికి ఆనందాన్ని నింపితే మందుబాబులకు మాత్రం నిషా దిగిపోయేలా చేసింది. పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్.

న్యూ ఇయర్ జోష్….

న్యూయర్ జోష్ ఈ ఏడాది కొందరికి మాత్రమే ఆనందాన్ని ఇచ్చింది. మరికొందరికి తలనొప్పిగా మారి పరుగులు పెట్టించింది. ఏడాది పొడవునా కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సారి పోలీసులు తీసుకున్న నిర్ణయాలు మందుబాబులకు, ఈవెంట్ మేనేజర్లకు చెమటలు పట్టేలా చేశాయి. పార్టీ ఏంజాయ్ కన్నా, పట్టుబడకుండా ఉంటే చాలని భావించే పరిస్థితి ఏర్పడింది.

ఆరు గంటల నుంచే…..

సాధారంగా డ్రంక్ డ్రైవ్ ని ట్రాఫిక్ పోలీసులు రాత్రి 11 గంటల నుండి అర్థరాత్రి 2 గంటల వరకు నిర్వహిస్తారు. కానీ 31వ తేదీ వేడుకలను దృష్టిలో పెట్టుకొని లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కలిసి స్పెషల్ డ్రైవ్ లు సాయంత్రం ఆరుగంటల నుండే స్టార్ చేశారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు కలిసి మొత్తం సిటీలో 239 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హ్యాపీ న్యూయర్ అంటూ కేకలు వేస్తూ, తాగి ఊగుతూ వెళుతున్న మందుబాబుల భరతం పట్టారు.

కోర్టుకు హాజరు…

హైదరాబాద్ కమిషనరేట్ లో 951 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873 కేసులు నమోదు చేయగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదు చేశారు. మొత్తం మూడు కమిషనరేట్లు కలిపి 3200 కేసులు నమోదు చేసి వాహానాలు సీజ్ చేశారు. పలు చోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగినా పోలీసులు లెక్క చేయలేదు. మరో రెండురోజుల్లో పట్టుబడిన వారంతా కోర్టుకు రావాల్సి ఉంటుంది. మొదటి సారి పట్టుబడితే వారి తాగిన మోతాదును బట్టి జరిమానా ఉంటుంది. అదే రెండవ సారి అయి ఉంటే జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్సు రద్దు తప్పదు.

పెట్టిన ఖర్చులు కూడా…

న్యూ ఇయర్ ఎంజాయ్ దేవుడెరుగు డ్రైవ్ లో అడ్డంగా బుక్కైన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పట్టుబడిన వారి వివరాలు సేకరించిన పోలీసులు వారు ఎక్కడ పని చేస్తున్నారో తెలుసుకొని మరీ ఆయా కంపెనీలకు లేఖలు కూడా రాస్తున్నారట. ఇంకేముంది ఒకపక్కన కేసులే కాకుండా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పబ్ ల పరిస్థితి కూడా ఆ ఏడాది దారుణంగా మారింది. ఏర్పాట్లు చేసుకున్న ఖర్చులు కూడా రాలేదంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. నిరంతరం పోలీసుల నిఘా, పార్టీ సమయాల్లో మఫ్టీల్లో పోలీసులు ఉండే సరికి ఇంకేముంది కుర్రకారు బెంబేలెత్తిపోయారు.

జీరో యాక్సిడెంట్స్…

గత ఏడాది పబ్స్, రిసార్ట్స్, హోటల్స్ డబుల్ ధమాకా తరహాలో డబ్బులు సంపాదిస్తే ఈ సారి మాత్రం వైన్ షాపుల యజమానులకు పంట పండినట్లైంది. పోలీసుల నిఘా, డ్రైవ్ ల పుణ్యమా అని దాదాపు వందల కోట్లకు పైగానే సరుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెండురోజుల ముందుగానే పార్టీల కోసం జనం మద్యం కొనుగోళ్లు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది జీరో యాక్సిడెంట్ పై పోలీసులు పెట్టిన ఫోకస్ పెద్ద సక్సెస్ సాధించినట్లైంది.

Tags:    

Similar News