ఇంటర్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై ఇవాళ వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని, [more]

Update: 2019-04-29 07:20 GMT

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై ఇవాళ వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని, ఫెయిలైన అందరు విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ వాల్యువేషన్ జరుపుతున్నట్లు ప్రభుత్వ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కచ్చితంగా మే 8వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని కోర్టుకు చెప్పారు. అయితే, వేసవి సెలవులు అయినా ఆ రోజు కోర్టు ఉంటుందని, కచ్చితంగా మే 8వ తేదీ మధ్యాహన్నానికి రీవేరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తమకు రిపోర్టు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News