భారీగా పెరగనున్న బంగారం ధర.. 2022లో చుక్కలే !

ఇప్పుడిప్పుడే బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయనుకునే లోపే.. మళ్లీ భారీగా పెరగనున్నాయంటూ మార్కెట్ పండితులు షాకిస్తున్నారు. వచ్చే ఏడాది బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని చెప్తున్నారు.

Update: 2021-12-30 12:23 GMT

కరోనా కారణంగా గతేడాది బంగారం ధర అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. ఇప్పుడిప్పుడే బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయనుకునే లోపే.. మళ్లీ భారీగా పెరగనున్నాయంటూ మార్కెట్ పండితులు షాకిస్తున్నారు. వచ్చే ఏడాది బంగారం ధరలు భారీగా పెరగనున్నాయని చెప్తున్నారు. ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా 10 గ్రాముల బంగారం ధర మరో సారి రూ.55 వేల మార్క్ ను తాకుతుందని పసిడి పండితులు అంచనా వేస్తున్నారు.

ఒమిక్రాన్ వ్యాప్తి, ద్రవ్యోల్బణం

ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర (ప్రాంతాలకు అనుగుణంగా) రూ.42 వేల నుంచి రూ.49 వేల మధ్యలో ఉంది. కానీ ఇప్పుడు రూపాయి విలువ క్షీణించడంతో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయింది. మరోవైపు ఒమిక్రాన్ ఎఫెక్ట్ కూడా బంగారం పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తితో.. రాబోయే రోజుల్లో బంగారం ధరలకు రెక్కలొస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది.. అంటే 2022 మే తర్వాత బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయని అంచనా. సో పసిడి ప్రియులు.. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు.. కాస్త అలెర్ట్ అయి ధరలు పెరగముందే కొనుగోలు చేసుకుంటే మంచిదని నిపుణుల అభిప్రాయం.


Tags:    

Similar News