కర్ణాటక ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రహ్మణి తండ్రితో కలిసి మొదటిసారి ఓటేయాలనుకున్న తన ఆశ నెరవేరలేదని చెప్పారు. గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబసభ్యులు బళ్లారిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, బళ్లారి వెళ్లవద్దని సుప్రీంకోర్టు జనార్ధన్ రెడ్డిపై ఆంక్షలు విధించడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. దీనిపై ఆయన కూతురు బ్రహ్మణి మాట్లాడుతూ... కోర్టు తీర్పును అనుసరించి తన తండ్రి ఓటు వేసేందుకు రాలేదని తెలిపారు. తన తండ్రితో కలిసి మొదటిసారి ఓటు వేయాలనుకున్నానని, కానీ అలా జరగలేదని చెప్పారు. ప్రతీఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.